• Breaking News

    చిరంజీవిగారి సలహా మర్చిపోను .........! సురభి పురాణిక్

     మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో త్రిష హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో కీ రోల్ యంగ్ హీరోయిన్ సురభి పురాణిక్ చేస్తుంది. 

    చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా త్రిష జాయిన్ అయింది.


    అయితే ఇటీవలే మరో ముఖ్యమైన పాత్ర కోసం యంగ్ హీరోయిన్ సురభి పురాణిక్ కూడా తీసుకున్నారు.  మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడంతో సురభి పురాణిక్ ఫుల్ సంతోషంగా ఉంది.
     

    ఇక తాజాగా షూటింగ్ షెడ్యూల్‌లో కూడా సురభి పురాణిక్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వంభరలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చింది ఈ బామా.


    చిరుతో కలిసి నటించడం చాలా థ్రిల్‌గా ఉందని, ఈ అవకాశం దొరకడం ఓ కలలా ఉందంటూ సురభి పురాణిక్ చెపింది. ఇక సెట్‌లో అడుగుపెట్టిన వెంటనే చిరు తన వర్క్ గురించి అడిగారని సురభి పురాణిక్ చెప్పింది. "చిరు సార్ చాలా కూల్‌గా మాట్లాడారు.


     నా ప్రాజెక్ట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వెర్సటైల్‌గా ఉండాలని సలహా ఇచ్చారు. ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మనలోని సత్తాబయటపడుతుంద చెప్పారు." 


    అంటూ సురభి పురాణిక్ చెప్పుకొచ్చింది. అయితే అలాంటి పాత్రలు దొరకడం కూడా మన చేతుల్లో లేదంటూ సురభి పురాణిక్ అంది.


    సురభి పురాణిక్ జననం 5 జూన్, వృత్తిపరంగా సురభి పురాణిక్ అని పిలుస్తారు, ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి .
     సురభి పురాణిక్ తమిళ చిత్రం ఇవాన్ వెరమాతిరి 2013తో చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది,


    సురభి పురాణిక్ ఉత్తమ మహిళా డెబ్యూగా SIIMA అవార్డు - తమిళం మరియు ఉత్తమ తొలి నటిగా విజయ్ అవార్డు నామినేషన్లను తీసుకుంది. 


    సురభి బీరువా 2015 తో తెలుగు చలనచిత్ర రంగ మొదలుపెట్టింది . సురభి పురాణిక్ ఎక్స్‌ప్రెస్ రాజా మరియు జెంటిల్‌మన్ రెండు 2016 వంటి విజయవంతమైన చిత్రాలలో భాగం . సురభి పురాణిక్


    శకత్ 2021తో కన్నడ చలనచిత్ర రంగ మొదలుపెట్టింది సురభి జూన్ 5న ఢిల్లీలో సురభి పురాణిక్‌గా జన్మించింది . సురభి పురాణిక్ ఢిల్లీలోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్ నుండి ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది .






    No comments